About Ram Karri ౹ రామ్ కర్రి గురించి...




రామ్ కర్రి గురించి - About Ram Karri





తూర్పుగోదావరి జిల్లా , రాయవరం మండలం, రాయవరం గ్రామానికి చెందిన రామ్ కర్రి - నవ యువ కవి, రచయిత, బ్లాగర్, సాంకేతిక గురు, సామాజిక కార్యకర్త, పాత్రికేయులు, సామాజిక మాధ్యమాల్లో తెలుగు వినియోగాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన తెలుగు భాషా సైనికుడు.

ఈయన  2008 నుండే అంతర్జాలంలో అనేక వెబ్సైట్ల ద్వారా తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన కృషీవలుడు

మరియు 

భారతీయ సంస్కృతి- సంప్రదాయాలను, నైతిక విలువల్ని, సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలని తపించే మహర్షి.



జననం - విద్య

ఈయన  కర్రి సుబ్రహ్మణ్యం, గంగాభవాని దంపతులకు, ఆయన అమ్మమ్మ ఊరు అయిన అదేయ్ జిల్లాకు చెందిన రంగంపేట మండలం, కోటపాడు గ్రామంలో జులై 16 1990 సంవత్సరం లో జన్మించారు...

ఈయన అమ్మమ్మ ఊరు అయిన కోటపాడు గ్రామంలో 5 వ తరగతి వరకు స్వగ్రామం అయిన రాయవరం లో 10 వరకు , అనపర్తి లో ఇంటర్మీడియట్ వరకు మరియు హైదరాబాద్ లో డిగ్రీ మరియు ఇతర సాంకేతిక పరమైన చదువుల్ని చదవడం జరిగినది...



తెలుగు భాషా సంరక్షణ వేదిక



తెలుగు భాష అభివృధి కోసం పాటుపడే సామాన్యులలో ఈయన కూడా ఒకరు...

                  “ తెలుగుభాషా సంరక్షణ వేదిక ” అనే ఒక సంస్థ ని ఏర్పాటు చేసి ఈ సంస్థ ద్వారా మన  తెలుగు భాష కి అలనాటి వైభవాన్ని తీసుకురావాలనే ఆకాంక్ష తో మన తల్లి భాషనీ మరచిపోతున్నా నేటి తరానికి ,ఆ...నుండి వ్యాకరణం, పద్యాలు, పాటలు, కవితలు, కథలను మరియు ఆనాటి కవుల గురించి వాళ్ళ రచనల గురించి మరొక మారు గుర్తు చేసి, మన తెలుగు యొక్క గొప్పదనాన్ని ప్రతి ఒక్కరికీ తెలిసేలా ముఖ పుస్తకలలోను, సామజిక వెబ్సైటుల ద్వారా మరియు వెబ్సైట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

అలాగేయ్ తెలుగు కవులను, రచయితలను ప్రోత్సహిస్తూ...

  నేటితరం కవుల రచనలను మన ఈ తెలుగుభాషా సంరక్షణ వేదిక లో పొందుపరుస్తూ సమాజానికి పరిచయం చేస్తున్నారు.

అలాగే తెలుగు భాష కోసం కృషి చేసే వాళ్ళను ప్రోత్సహిస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.

వాట్సప్ లలో సమూహాలను ఏర్పరచి అభివృధి వైపుగా అడుగులు వెయ్యడం జరుగుతుంది...

రేపటి తరం మన తెలుగు గొప్పదనం తెలుసుకోవాలనే ఉద్యేశం తో తెలుగు భాషా సంరక్షణ వేదిక అనే వెబ్సైట్ ని రూపొందించి అందులో పొందుపరచడం జరుగుతుంది...

అలాగే తెలుగు గ్రంథాలయం ని ఏర్పాటు చేసి తద్వారా ప్రతీ తెలుగు పుస్తకాన్ని పిడిఎఫ్ రూపంలో అందించి పుస్తక జ్ఞానాన్నీ చేకూర్చడం జరుగుతున్నది..

ఈ విధంగా ఆయన తెలుగు భాష అభివృధి కోసం  కృషి చేస్తున్నారు...



రామ్ కర్రి పబ్లికేషన్స్

అదే విధంగా నవ కవుల రచనలను రామ్ కర్రి పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించడం జరుగుతున్నది..





రాంకర్రి జ్ఞాన కేంద్ర


మన పూర్వీకులు అందించిన అపూర్వ సంపద అయిన విజ్ఞానాన్ని, భారతీయ సిద్ధాంతాల్ని, భారతీయ సంస్కృతి - సంప్రదయాల్ని , నైతిక విలువల్ని, సనాతన ధర్మాన్ని

మరియు
మన పూర్వీకుల నుండి మనం గ్రహించ లేకపోయిన మరెన్నో అద్భుతమయిన విషయాలను భావి తరాలకు అందించాలనే దృఢ సంకల్పం తో " రాంకర్రి జ్ఞాన కేంద్ర " అనే ఒక స్వచ్ఛంద సంస్థ ని స్వగ్రామం అయిన రాయవరం లో స్థాపించడం జరిగినది.

అటువంటి అద్భుతమైన విషయాలను ప్రపంచంలో ఉన్న ప్రతీ తెలుగు వారు పొందాలి అనే ఉధ్యేశం తో…

 ఆ సంస్థ యొక్క అధికారిక వెబ్సైట్ అయిన www.ramkarri.org   ద్వారా స్వచ్ఛందం గా అందించడం జరుగుతుంది…

అలాగే 276 వాట్సాప్ సమూహాలు మరియు టెలిగ్రామ్ గ్రూప్ ల ద్వారా కూడా ప్రజలకుఅద్భుతమైన విషయాలను అందిస్తున్నారు.

భారతీయ సంస్కృతీ - సంప్రదాయాలు, విజ్ఞానం , సనాతన ధర్మం , భారతీయ సిద్ధాంతాలు, నైతిక విలువలు అలాగే అనేక అద్భుతమైన విషయాలు అన్నీ ఒకే చోట లభిస్తున్నాయి కనుక ఈ వెబ్సైట్ ని " విలువల నిఘంటువు " అని కూడా అభివర్ణిస్తూ ఉంటారు వీక్షకులు.



ప్రాణధాత ఫౌండేషన్


   
      " ప్రాణధాత ఫౌండేషన్ " అనే సేవా సంస్థ ని ఏర్పాటు చేసి, రక్త దాతలను సమాచారం అందివ్వడానికి వీలుగా జిల్లా ల వారిగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి, మరియు " ప్రాణధాత బ్లాగ్ " లో రక్త దాతల వివరాలను పొందుపరచడం జరిగినది.  

రక్తం అవసరమైన వాళ్ళు ఫోన్ చేయడానికి వీలుగా 8096339900 చరవాణి సంఖ్యను అందుబాటులో ఉంచి,

                 మన తెలుగు రాష్ట్రాలలోని వారికి ఎవరికైనా రక్తం అవసరం అయి పై నెంబర్ కి ఫోన్ చేసిన లేదా వాట్సాప్ లో సందేశం పంపిన వెంటనే ఆ సందేశాన్ని రక్త గ్రహిత యొక్క జిల్లాలో దగ్గరలో ఉన్నవారికి ఆ సమాచారం అందించి వాళ్ళచే రక్త దానం చేయించడం జరుగుతుంది.



వైద్య నిలయం 



            ఆరోగ్యమే మహాభాగ్యము మనిషికి ఏమిటి ఉన్నా, ఎన్ని ఉన్నా, ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవి కి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము.

ఎవరికైనా ఏదయినా ఆరోగ్య సమస్య ఉంటే దాని గురించి సరియైన అవగాహన లేక చాలా బాధపడుతూ ఉంటారు.

                               వారి కోసం వైద్య నిలయం అనే వాట్సాప్ గ్రూపులను నడుపుతున్నారు అందులో నిపుణులు అయిన ఎందరో వైద్యుల్ని ని అడ్మిన్ గా నియమించి ఎవరికైనా ఏదయినా ఆరోగ్య సమస్య, సందేహాలు ఉంటే దానిని సమూహం లో పెడితే వాటికి అనుభవజ్ఞులైన వైద్యులు సలహాలు, సూచనలు అందిస్తారు.

అలాగే ఎన్నో ఆరోగ్య సూచనలను వైద్యుల పర్యవేక్షణలో ఈ వైద్య నిలయం బ్లాగ్ ద్వారా అందిస్తున్నారు.



సాంకేతిక విజ్ఞానం

                     ప్రతీ తెలుగు వారు సాంకేతిక విజ్ఞానాన్ని నేర్చుకోవాలనే తపనతో " సాంకేతిక విజ్ఞానం " అనే ఒక బ్లాగ్ ని తయారు చేసి తద్వారా సాంకేతిక పరమైన విషయాలను అచ్చమైన తెలుగు లో అందిస్తున్నారు.

అదే విధంగా విద్యార్థులకు సాంకేతిక పరమైన ఎన్నో సందేహాలకు అంతర్జాలం లోనే  సందేహ నివృత్తి చేస్తున్నారు...

     సాంకేతిక పరమైన విద్యలను తెలుగు తెలిసిన ప్రతీ ఒక్కరూ అభ్యసించాలి అనే ఆతృత తో అచ్ఛమైన తెలుగులోనే ఉచితం గా " సాంకేతిక విజ్ఞానం " ద్వారా అందిస్తున్నారు.



            తెలుగు ఎడమ చేతి వాటం వాళ్ళ సంఘం                   ( Telugu Lefties Club - TLC )


ప్రపంచం లో ఉన్న తెలుగు ఎడమ చేతి వాటం వాళ్ళందరినీ ఒక తాటి పైకి తీసుకొని వచ్చి , ఆలోచనలను పంచుకొని సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో ఏర్పాటు చేసారు.. తెలుగు ఎడమ చేతి వాళ్ళ సంఘాన్నీ తెలుగు లెఫ్టిస్ క్లబ్ ( టి.ఎల్.సి )

సంఘం లో ఎడమ చేతి వాటం గల ప్రతీ తెలుగు వారిని చేర్చుకుంటున్నారు తద్వారా సమాజానికి సేవ చేస్తున్నారు...



సమగ్ర భారతీయ తెలుగు కాలమాన సూచిక (జంత్రి)


                    మనం సమగ్రమైన భారత తెలుగు కాలమానాన్ని (జంత్రి) మరచిపోయి, అర్థంలేని గ్రెగోరియన్ (ఆంగ్ల) క్యాలండర్ ను అనుసరిస్తున్నాం అనే ఆవేదనతో...

      మన భారతీయ కాలమానం (జంత్రి) ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది.. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకృతికి విరుద్ధం అని భావించిన ఆయన...

         తెలుగు వారి కోసం మన భారతీయ కాలమాన సూచికని  ( జంత్రి )  అచ్చ తెలుగు లో ప్రతీ సంవత్సరం ముద్రించి ఉచితంగా అందచేస్తున్నారు ఆయన.

                    ఇందులో  తెలుగు మొదటి నెల అయిన చైత్రం తో మొదలయ్యి, చివరి నెల అయిన పాల్గుణం తో ముగుస్తుంది... 

ఆంగ్ల క్యాలెండర్ మాదిరి జనవరి నుండి డిసెంబర్ ఉండదు...

                       తిధుల ద్వారా గణింపబడిన ఈ భారతీయ తెలుగు కాలమాన సూచిక ను ( క్యాలెండర్ ) ని రూపొందిస్తున్నారు, ఇదే నిజమైన కాల సూచిక...

                      ప్రతీ సంవత్సరం ఈ భారతీయ కాల సూచిక (జంత్రి) ను చైత్రం మాసపు మొదటి రోజయిన చైత్ర శుద్ధ పాడ్యమి రోజున అనగా ఉగాది  పర్వదిననా విడుదల చేస్తున్నారు రామ్ కర్రి .




ఇలాంటి మరెన్నో సేవలను సమాజం కోసం స్వచ్ఛందంగా చేస్తున్నారు...




వెబ్సైట్

వాట్సాప్ 

          

యూట్యూబ్ 

వాట్సాప్ గ్రూప్స్ లింక్ 

టెలిగ్రామ్ గ్రూప్ 

లింక్డ్ ఇన్ 

ట్విట్టర్ 


ఫేస్బుక్ 


గూగుల్ మ్యాప్ 



చిరునామా 

రాంకర్రి జ్ఞాన కేంద్ర ,
1 - 240 , రాజ రాజేశ్వరీ కాలనీ ,
రాయవరం , రాయవరం మండలం ,
తూర్పుగోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్ - 533346







◆ ◆ ◆

అర్ధనారీశ్వరుడంటే ఎవరు, ఆపేరు ఎలా వచ్చింది ?

అర్ధనారీశ్వరుడంటే ఎవరు, ఆపేరు ఎలా వచ్చింది ?



పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వరము అని హిందూ పురాణాలలో చెప్పబడి ఉంది. తలనుండి కాలి బొటనవేలివరకూ సమానముగా అంటే నిలువుగా చెరిసగముగా ఉన్న మగ, ఆడరూపాలు ఒకటిగా ఉండడము. అర్ధ (సగమైన ) నారి (స్త్రీ), ఈశ్వర (సగమైన పురుషుడు) రూపము (కలిగిఉన్న రూపము) అవుతుంది. తల ఆలోచనకి, పాదము ఆచరణికి సంకేతాలైతే, పార్వతీపరమేశ్వరులు తలనుండి కాలివరకు సమముగా నిలువుగా ఉంటారంటే ఇద్దరి ఆలోచనలూ, ఆచరణలూ ఒక్కటే అన్నమాట. లోకములో భార్యా భర్తలు అన్యోన్యముగా తప్పు అయినా ఒప్పు అయినా ... ఆచరణలోనూ, ఆలోచనలోనూ కర్మలలోను, కార్యాలలోను, నిర్ణయాలలోనూ, నిర్మాణాలలోనూ ఒకటిగా చెరిసగముగా ఉండాలని హిందూపురాణాలు అర్ధనారీశ్వరాన్ని చూపడము జరిగింది. పరమేశ్వరుని, అంబికను ఏకభావముతో, భక్తితో సేవించాలి. అప్పుడే అధిక శుభము కలుగుతుంది. ఇరువురియందును సమాన ప్రీతి ఉండవలెనన్న ... ఆ ఇరువురియందు మాతాపితృ భావము ఉండాలి.
అర్ధనారీశ్వరుడు



లయకారుడిగా శివుడికి అధికారం అధికంగా ఉండాలి. ఆ అధికారాన్నే... పార్వతి, దుర్గ, శక్తి రూపాలుగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఆ శక్తిని ఆయన తనలో భాగంగా ధరించాలి. శివుడు, శక్తి... కలిసి పనిచేయడమంటే, స్త్రీపురుషులు సమానమేనని అంతరార్థం. ఈ సంప్రదాయాన్ని చూపడానికే శివుడు + శక్తి కలిసి అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తారు. శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు ఉండరు. శక్తితో కలిసిన శివుడిని సంపూర్ణుని (సగుణబ్రహ్మ)గా, శక్తితో లేనప్పుడు అసంపూర్ణుని (నిర్గుణబ్రహ్మ)గా పండితులు చెబుతారు. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా. అందుకే కాలం కూడా స్త్రీ పురుష రూపాత్మకమైంది. చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధభాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజంనుంచి ఫాల్గుణం చివరి వరకు గల కాలం స్త్రీ రూపాత్మకం.
అర్ధనారీశ్వరుడు అవతరించినది మాఘ బహుళచతుర్ధశి రోజైన మహాశివరాత్రి నాడు
ఆది దంపతులు - జగత్పితరులు



'జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ' అని స్తుతిస్తుంటారు. జగత్తుకంతటికీ తల్లిదండ్రులలాంటి వారు ఆ పార్వతీపరమేశ్వరులు. ఈ ఆది దంపతులు ఇద్దరూ దేహాన్ని పంచుకొని అర్ధనారీశ్వర అవతారంతో కన్పించటం కూడా అందరికీ తెలిసిందే. ఇంతకీ ఆ శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు? ఆ అమ్మకు తన దేహంలో సగభాగాన్ని ఎలా కల్పించాడు? అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణమేమిటీ? అనే విషయాలను వివరించి చెబుతుంది ఈ కథాసందర్భం. ఇది శివపురాణంలోని శతరుద్ర సంహితలో కన్పిస్తుంది. నందీశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడికి ఈ కథను వివరించాడు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయటం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు. అలా తానొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవం పోస్తూ ఎంతకాలంగా తన పనిని తాను చేసుకుపోతున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగలేదు. ఇందుకు ఎంతగానో చింతించిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు.


బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. సగం పురుషుడు, సగం స్త్రీ రూపం గల దేహంతో ఆ శివస్వరూపం వెలుగొందసాగింది. పరమశక్తితో కూడి ఉన్న ఆ శంకరుడిని చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేసి అనేక విధాల స్తుతించాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మ సృష్టికి సహకరించటానికే అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు చెప్పాడు. అలా పలుకుతున్న శివుడి పార్శ్వ భాగం నుంచి ఉమాదేవి బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు ఆ జగనాత్మను స్తుతించి సృష్టి వృద్ధి చెందటం కోసం సర్వసమర్థమైన ఒక రూపాన్ని ధరించమని, తన కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్థించాడు. ఆమె బ్రహ్మను అనుగ్రహించింది. ఆ వెంటనే భవానీదేవి కనుబొమల మధ్య నుంచి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి అక్కడ అవతరించింది. అప్పుడా శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు కనుక ఆయన కోర్కెలను నెరవేర్చమని కోరాడు. పరమేశ్వరుని ఆజ్ఞను ఆమె శిరసావహించింది. బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది. ఆనాటి నుంచి ఆ లోకంలో నారీ విభాగం కల్పితమైంది.
సృష్టి ఆవిర్భావం




స్త్రీ, పురుష సమాగమ రూపమైన సృష్టి ఆనాటి నుంచి ప్రవర్తిల్లింది. స్త్రీ శక్తి సామాన్యమైనది కాదని, ప్రతివారు స్త్రీ మూర్తులను గౌరవించి తీరాలని ఆదిదేవుడు, ఆదిపరాశక్తి ఇద్దరూ సమానంగా ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారో ఈ లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నారనే విషయాన్ని ఈ కథాసందర్భం వివరిస్తుంది. అంతేకాక స్థితి, లయ కారకులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తొలుత తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించిన దానివల్ల ఎక్కువ ఫలితం కలగలేక పోయిందని, పరమేశ్వర అనుగ్రహంతో స్త్రీత్వం అవతరించిన తర్వాతే సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని ఈ కథ వివరిస్తోంది. స్త్రీ శక్తి విశిష్టతను తెలియచెప్పేందుకు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అర్ధనారీశ్వర రూపంలో అవతరించాడు. కనుక పురుషాధిక్యాన్ని ప్రదర్శించటం కానీ, స్త్రీలను, స్త్రీ శక్తిని కించపరచటం కానీ ఎంతమాత్రం దైవహితం కాదనే విషయాన్ని ఈ కథలో మనం గమనించవచ్చు.



లోకం లో సహజం గా వినిపించే మాట పురుషుడే అధికుడని . శంకరుని విషయములో అది సరికాదు . శంకరుడు తన భార్య పార్వతిని నిరంతరము గౌరవిస్తూనే ఉంటాడు . పార్వతితో తనకు వివాహము కాకముందు తానే స్వయముగా మారు రూపములో ఓ బ్రహ్మచారి వేషములో ఆమె వద్దకు వెళ్ళి -- శంకరునికి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదని బూడిదమాత్రమే ఒంటికి పూసుముటాడని , ఇల్లు లేని కారణముగా శ్మశానములోనే ఉంటాడని , నిత్యము బిక్షకోసము తిరుగుతూ ఉంటాడని , బిక్షపాత్రకూడా లేని కారణముగా పర్రెని బిక్షపాత్రగా ధరిస్తాడని ... ఇలా ఉన్నది ఉన్నట్లుగా తన కాబోయే భార్యకి నిజాన్ని చెప్పిన ఒకేఒక్క ప్రియుడు శంకరుడు . లోకములో ప్రేముకులందరికీ ఒక తీరుగా మార్గదర్శకుడు కూడా.



తనకంటే తన భార్య పార్వతి బాగా ఆలోచించగలదని తెలిసి తనకంటే జ్ఞానవతిగా ఆమెను గుర్తించి నిరంతరము ఆమె వద్దకు వెళ్ళి భిక్ష యాచిస్తాడు శంకరుడు . ఆయన చేతిలో పుర్రె మన తలమీది పైభాగానికి సాంకేతం , ఆమె పెట్టే అన్నము జ్ఞానాని సంకేతము కాబట్టి ఆయన ఆ అన్నపూర్ణ నుండి గ్రహించేది " జ్ఞాన (అన్న) భిక్ష " తప్ప మనలా అన్నము మాత్రము కానేకాదు . అందుకే
" అన్నపూర్ణే ! సదాపూర్ణే ! శంకరప్రాణవల్లభే ! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహి చ పార్వతి !. అంటుంది శ్లోకము

మహాభారత అరణ్య పర్వంలో యక్ష ప్రశ్నలు – జవాబులు

మహాభారత అరణ్య పర్వంలో యక్ష ప్రశ్నలు – జవాబులు


        
మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తర ఆరణి లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నల్గురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడీ మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదౄష్యవాణి పలికినది ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆదీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకనే నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ఆ ప్రశ్నలు ఇవే!!! ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)

6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)

7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం)

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? (అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.)

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మౄత్యు భయమువలన)

12. జీవన్మౄతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు)

13. భూమికంటె భారమైనది ఏది? (జనని)

14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)

15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తౄణం కంటె దట్టమైనది ఏది? (చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)

20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ణ్జం చేయుటవలన)

21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)

22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది? (రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన)

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)

25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)

29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు? ( కూమారుడు)

33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)

34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)

35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)

36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)

39. ఎవరితో సంధి శిధిలమవదు? (సజ్జనులతో)

40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)

41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)

42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి, ఆకాశములందు)

43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ణ్జానం)

44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)

45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం, క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో)

46. తపస్సు అంటే ఏమిటి? ( తన వౄత్బికుల ధర్మం ఆచరించడం)

47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)

48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)

49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు)

50. జ్ణ్జానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)

51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)

52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)

53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)

54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం కలిగి ఉండటం)

55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)

56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)

57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)

58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)

59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)

60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)

61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం)

62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)

63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన భర్తలో)

64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు; వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ, దానం చెయ్యనివాడు)

65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)

66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)

67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు)

68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? (సుఖపడతాడు)


69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తౄప్తి చెందేవాడు)

70. ఏది ఆశ్చర్యం? (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)

71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు)

72. స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు)