పూజలో కొబ్బరికాయ క్రుళ్ళితే మంచిదా? కాదా?

పూజలో కొబ్బరికాయ క్రుళ్ళితే మంచిదా? కాదా?




పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమేమికాదు. అపచారం అంతకన్నా కాదు తెలిసి పని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రంచేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదేకాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ క్రుళ్ళితే క్రుళ్ళిన భాగాన్నితీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుగుకొని పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించటం మంచిది. వాహనాలకి కొట్టే కాయ క్రుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి.

ఉత్తరం దిక్కున తలపెట్టి ఎందుకు నిద్రించరాదు?

ఉత్తరం దిక్కున తలపెట్టి ఎందుకు నిద్రించరాదు?




మన భూమిలో గురుత్వాకర్షణశక్తి ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది. మనమూ అలానే నిద్రపోయామంటే ఉత్తర దక్షిణాల్లో ఇమిడి ఉన్న ఆ శక్తి యొక్క తరంగాలు మన మెదడులో దాగావున్న శక్తివంతమైన విద్యుత్ తరంగాలని తగ్గించి వేస్తాయి. దానివలన అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా మార్పువస్తుంది. మెదడులో లోపాలు తల ఎత్తుతాయి. అలా కాకుండా తూర్పు పడమరల వైపు నిద్రిస్తే మెదడు సుఖవంత స్థానంలో ఉంది మెరుగు పడుతుంది. రక్త ప్రసరణసరిగా జరిగి శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది.

ఏడు’ సంఖ్య మంచిదా కాదా?

ఏడు’ సంఖ్య మంచిదా కాదా?


                                         
తిరుమల తిరుపతిలో కొండలు 7. ప్రత్యక్షదైవం సూర్య భగవానుడి నుంచి వచ్చే కిరణాలు 7, పాతాళం క్రింద లోకాలు 7, భువర్లోకాలు 7. అలాగే ద్వీపాలు 7. పెళ్ళిలో వధూవరులు ఇద్దరూ కలిసి వేసే అడుగులు 7. అగ్ని దేవుని నాలుకలు 7. బ్రహ్మోత్సవాలు జరిగేది 7వ నెలలో. సప్తస్వరాలు కూడా ఏడే. 7 సంఖ్యమంచిది కాదని కొందరి మూఢనమ్మకము. 7 కూడా మంచిదే. భగవంతుడు సృష్టించిన ప్రతిదీ మనకోసమే. డాన్ని ఉపయోగించే పద్ధతుల వల్లే ఫలితం మనకిలభిస్తుంది.

మంగళ, శుక్రవారాలు ఇతరులకు డబ్బు ఎందుకివ్వరు?

మంగళ, శుక్రవారాలు ఇతరులకు డబ్బు ఎందుకివ్వరు?





సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు. 
కనీసం ఆ 2 రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నము. 
అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు. 
ధనాన్ని అదుపు  చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా 
మనకి గానీ, ఇతరులకు గానీ ఆపదసమయాల్లో ఈ నిమయం పనికి రాదు. ఇలా చెయ్యటంవల్ల మరింత ధనం పోతుంది.

యోగ మంటే ఏమిటి? యోగ శాస్త్ర ప్రాముఖ్యం.

యోగ మంటే ఏమిటి? యోగ శాస్త్ర ప్రాముఖ్యం.


information on yoga definition excellent yoga postures, yoga exercises, yoga positions and essential facts about yoga
యోగ మంటే ఏమిటి?

యోగ మంటే అదృష్టం, కూడిక, కలయిక, సంబంధం, ధ్యానం అనే అర్థాలు ప్రచారంలో వున్నాయి. అదృష్టం అనే అర్థంలో యోగ శబ్దాన్ని వాడుతూ యోగం బాగుండటం వల్ల ఇంతవాడు అంత వాడైయ్యాడు అని అంటూ వుంటారు. కూడిన అనే అర్థంలో యోగశబ్దాన్ని వాడుతూ ఒకటి ప్రక్కన సున్నా చేరిస్తే పది, పది పక్కన ఆరు చేరితే పదహారు, నాలుగు నాలుగు కలిపితే ఎనిమిది, ఎనిమిది అయిదు కలిపితే పదమూడు అని అనడం మనకు తెలుసు. కలయిక లేక సంబంధం అనే అర్థంలో యోగశబ్దాన్ని వాడుతూ తల్లి-కొడుకు, తల్లి-కూతురు, తండ్రి-కొడుకు, తండ్రి-కూతురు, భార్యా-భర్త, అత్తా-కోడలు, గురువు-శిష్యుడు అని అంటూ వుంటారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆత్మ-పరమాత్మ కలయిక కోసం చేసే ప్రయత్నాన్ని ధ్యానం అని అంటారు. ఇది ఎకాగ్రతపై ఆధారపడి వుంటుంది. దీనికి విశ్వాసం, నమ్మకం చాలా అవసరం.

యోగశాస్త్రంలో ధ్యానం ఒక ప్రధానమైన అంశం. ధ్యానం దేని కోసం అని అడిగితే ఆత్మ-పరమాత్మల కలయిక లేక ఆత్మ సాక్షాత్కారం కోసం అని సమాధానం లభిస్తుంది. ఇది సాధ్యమా అని అడిగితే చిట్టా ప్రవృత్తుల్ని, ముఖ్యంగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల్ని జయించగలిగితే  సాధ్యమేనని సమాధానం లభిస్తుంది. యోగశాస్త్ర ప్రణేత పతంజలి మహర్షి మాటల్లో యోగశ్చిత్త వృత్తి నిరోధః అంటే చిత్త ప్రవృత్తుల నిరోధమే యోగమన్న మాట.

యోగ శాస్త్ర ప్రాముఖ్యం.

 ఆది మానవుని జననంతోనే యోగ విద్య ప్రారంభమైంది. యోగం మనిషి జీవన విధానమని చెప్పవచ్చు. యోగాభ్యాసం మనిషికి ఆరోగ్యం, శక్తి, తేజస్సు, చురుకుదనం ప్రసాదించడమే గాక మనిషి జీవితంలో సుఖ, సంతోష, ఆనందాల్ని నింపుతుంది. ఆరోగ్యం సరిగా లేకపోతే సిరిసంపదలు ఎన్ని వున్నా ఏం లాభం? పరమేశ్వరుడు యోగ విద్యకు ఆద్యుడు అని అంటారు. అనేకమంది యోగులు, మునులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మార్షులు యోగావిద్యను ప్రపంచానికి అందించారు. ఆనాడు ప్రచారంలో వున్న యోగ ప్రక్రియల్ని పరిశోధించి, స్వానుభవంతో పతంజలి మహర్షి రచించిన యోగాదర్శనం మహత్తరమైన యోగశాస్త్ర గ్రంథమని చెప్పవచ్చు. రాజయోగం, భక్తియోగం, జపయోగం, జ్ఞానయోగం, కర్మయోగం, హఠయోగం మొదలుగా ఉన్న అన్నీ యోగాశాస్త్రానికి సంబంచించిన నిధులే.


ఫలితాన్ని పరమేశ్వరునికి వదిలి నిష్కామభావంతో కర్మ చేయడమే మనిషి కర్తవ్యమని గీతాకారుడు బోధించాడు. ఇడ, పింగళ, సుఘమ్నాడుళ సహకారంలో కుండలేనీ శక్తిని ఉత్తేజితం చేసి, మనిషిలో నిద్రాణమైయున్న దేవతాశక్తిని జాగృతం చేస్తే జన్మధన్యమవుతుందని బోధించి, అందుకు హఠయోగాన్ని మత్సేంద్రనాధుడు, గోరఖ్ నాథుడు ప్రతిపాదించారు. కాలక్రమేణతాంత్రికులు, కాపాలికులు ఈ రంగంలో ప్రవేశించి స్త్రీ పురుషుల సంభోగానికి ప్రాధాన్యం యిచ్చి, అదే యోగసమాధి అందించే పరమానందమని చెప్పి యోగవిద్యను దారి మళ్లించేందుకు ప్రయత్నించారు. కాని సమాజం దాన్ని హర్షించలేదు.

 యోగశాస్త్రం మన భారతదేశంలో ఆధ్యాత్మికత్వాన్ని సంతరించుకొని మూడు పూవులు ఆరు కాయలుగా వర్థిల్లింది. ఈనాటి యుగంలో యోగవిద్యకు సైన్సుసాయం లభించింది. పలువురు మేధావులు, డాక్టర్లు, నిపుణులు ఈ రంగంలో ప్రవేశించి శారీరక, మానసిక వికాసానికి దోహదం చేసే విధంగా యోగశాస్త్రాన్ని మలిచి యోగాచికిత్సా విధానం ప్రారంభించి మానవాళికి మహోపకారం చేశారు, చేస్తున్నారు.

గ్రహణ సమయములొ ఉపవాసములు ఉండడం ఎందుకు?

గ్రహణ సమయములొ ఉపవాసములు ఉండడం ఎందుకు?


   ఓ మాదిరి సంప్రదాయం ఉంది .మడి ,ఆచారాలు పాటించే  ఇళ్ళలో ఇప్పటికి గ్రహణసమయములో  ఉపవాసము ,తీనే పదార్దాలు ఫై దర్భలు వేయడం చూస్తూనాము .ఈతరం  వాళ్ళకు అది వింతగాను మూర్ఖంగాను కనిపించవచ్చు .ఆలాగే గ్రహణానికి కొన్ని గంటలముందు నుంచే ఉపవాసం ఉండడం విడ్డురంగా ఉంటుంది .2-3-1980 నాటి ప్రముఖ దిన పత్రికలలొ  విక్రం సారాభాయ్ పరిశోధన కేంద్రం  వారి వ్యాసం కనువిప్పు కలిగిస్తుంది .గ్రహణ  సమయంలో సూర్యకాంతి  పడిన నీరు కలుషితం అవుతుందని దీనిని నివారించటంలొ దర్భలు శ్రేష్టంమైన ఓషధ గుణాలు కలిగిఉన్నయని వీరి పరిశోధన .దీని ప్రకారం తినే పదార్ధాలఫై  వేసిన ధర్బలు తులసి దళముల  కంటే ఎక్కువుగా చేడును కలిగించే కిరణములను నిరోదిస్తుంది  అని చేప్పావచ్చు .అదే విధంగా గ్రహణసమయంలొ  సుర్యకిరములులోని  మార్పులు  అనూహ్యoగా  ఉండడంతో  జీర్ణవ్యవస్థ తో దీని ప్రభావం ఎక్కువుగా ఉంటుంది .అందుకనే జంతువులు కూడా ఆ సమయంలో ఆహారంలో ముట్టవని జైపూర్ జంతు ప్రదర్శనశాల  వారి  పరిశోధనలో బయటపడింది .

                              ప్రకృతిపరంగా  ఏర్పడిన  ఈ మార్పుకు అనుగుణంగా సమస్త జంతువులు ప్రవర్తిస్తుoటాయి .తేలివైన మానవుడు ప్రకృతికి బిన్నoగా ప్రవర్తిస్తునాడు .ఆ సమయములో  ఏర్పడే కిరణాలు ప్రభావం వల్ల శరీరంలోని మార్పులుకు అనుగుణంగా  ఆ సమయంలో భోజనాలు చేయకుండ ఉంటే మంచిది అని పెద్దలు చేపుతుంటారు .ఆ క్షణంలో  మార్పు కనిపించదు  కానీ దాని ప్రభావం తప్పకుండ ఉంటుంది

గుళ్ళలొ ,ఆలయాలలో ప్రధషణలు ఏవిధంగా చేయలీ?

గుళ్ళలొ ,ఆలయాలలో ప్రధషణలు ఏవిధంగా చేయలీ?



మనకి  మాములుగా   ప్రధషణలు తెలుసు కానీ గుడి లొ  కుడి నుండి ఎడముకు ,ఎడమ  నుండి కుడి కి  చేస్టారు .ఎందుకు చేస్టారు ,ఎలా చేస్టే మంచిది .

                             మన  ఆలయాలు రెండు రకాలు  ధ్వజస్తంభం కలిగిఉన్నవి . ధ్వజస్తంభం లేనీవీ .ఇవి ఆగమ సస్త్రనుసారం గా నిర్మించబడినవి .వీటీనీ  దేవాలయాలు అనీ ,దేవస్థానములు అనీ  వ్యవహరిస్తారు .ఆగమ శాస్త్రంతో నిమిత్తం లేకుండ కేవలం వాస్తు చూచీ నిర్మించేవీ మందిరాలు ,ప్రధషణలు అక్కడ  ఇక్కడ కూడా చేస్తారు ..ధ్వజస్తంభం ఉన్న ఆలయాలకి ధ్వజస్తంభం నుండి ప్రారంభించి  ధ్వజస్తంభం వరుకు చేస్టే ఒక ప్రధషణ  పుర్తిఅవుతుంది .మందిరం అయతే ముఖద్వారం నుండి ముఖద్వారం వరుకు,సామాన్యంగా  ఆనీ ఆలయాలకు ,మందిరాలకు మూడు ప్రధషణలు  చేస్తారు .అంజనేయ  స్వామి కీ  ఐదు ప్రధషణలు చేయలీ .ఎందుకంటి హనుమాన్  పంచ సంఖ్యాయ అనీ చేప్పినందువలన ,హనుమంతుడు కీ ఐదు సంఖ్య అంటే  చాల ప్రేతి

                    ఒక్క ముఖ్యమైన కోరిక తో  చేసేటప్పుడు  108,54,27,11, ఇలా నియమిత సంఖ్య తో చేస్తారు .ఇక శివాలయం  లొ  ప్రతేఖంగా  చేసే ప్రధషణలను  చండీ ప్రధషణలు అంటారు .

                      దీనీ విధానం ప్రతేఖంగా ఉంటుంది .ధ్వజస్తంభం నుండి  ప్రారంభించి  దక్షిణం గా ఆలయం వెనుక గా సోమసుత్రం వరుకు చేసీ మరల వెనుక గా  ధ్వజస్తంభం  వరుకు వచ్చి మళ్ళి ప్రధషణ్ క్రమం లొ  ఆలయం చుట్టు తిరిగి  ధ్వజస్తంభం వరుకు  ప్రధషణ్ చేస్టే అదీ చండీ  ప్రధషణ అంటారు .యిదె  చాల విశేషం  కలిగిస్తుంది అనీ  అంటారు...